డోన్: బేతంచెర్ల మండలంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా : డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Sep 29, 2026 సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎంబాయి, బైనపల్లె, సంకలాపురం, మండ్లవానిపల్లె, సీతారామపురం గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.50 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోట్ల ప్రారంభించారు