పాలకొండ: తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
పాలకొండ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 9 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సాయం అందింది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. వీరఘట్టం, సీతంపేట, పాలకొండ, భామిని మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఈ సాయాన్ని అందుకున్నారు.