కనిగిరి: పట్టణంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వృద్ధులు
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల నుండి కంటి జబ్బులతో బాధపడుతున్న వృద్ధులు పెద్ద సంఖ్యలో వైద్య శిబిరానికి తరలివచ్చారు. పెద్ద శిబిరానికి వచ్చిన వృద్ధులకు కంటి వైద్య నిపుణులు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, ఆపరేషన్ల అనంతరం వారిని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో స్వగ్రామాలకు చేర్చనున్నారు.