కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో పర్యటకుల సందడి, అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల సముద్ర తీరానికి ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు సముద్రంలో సరదాగా గడుపుతూ, ఇసుక దిమ్మెలపై ఆటలాడుతూ ఆనందించారు. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.