గిద్దలూరు: గిద్దలూరు తహసిల్దార్ కార్యాలయంలో కస్తూరిబా గాంధీ విద్యార్థుల నృత్యాలు, ఆసక్తిగా తిలకించిన ప్రజాప్రతినిధులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన దిన్షా నృత్యం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ వేషధారణలో విద్యార్థినులు చేసిన అద్భుత నృత్య ప్రదర్శనకు వేడుకలకు హాజరైన వారంతా మంత్రముగ్ధులయ్యారు. విద్యార్థినుల ప్రతిభను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అభినందించారు.