కొత్తపేట: కండ్రిగలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన చైర్మన్ రెడ్డి అనంత కుమారి
కొత్తపేట మండలం కండ్రిగ కాలనీలో ఏపీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి పర్యటించి, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకే చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.