గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ విద్యుత్ దీపాలతో అలంకరణ, ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ విద్యుత్ దీపాలతో వెలిగిపోయింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుగా పురస్కరించుకొని పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ని సురేష్ విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆకర్షణీయంగా పోలీస్ స్టేషన్ కనిపిస్తూ ఉండడంతో ప్రజలు పోలీస్ స్టేషన్ తిలకించేందుకు ఉత్సాహం చూపించారు.