ఏటూరునాగారం: ములుగు జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 3 బంగారు పతకాలు సాధించిన జాడి సాయిదుర్గ
ములుగు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జాడి సాయిదుర్గ లాంగ్‌జంప్, 60 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం సాధించి మూడు బంగారు పతకాలు గెలుచుకుంది. ఈ విజయంతో సాయిదుర్గ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.