భువనగిరి: భువనగిరిలో రేపు కాంగ్రెస్ భారీ నిరసన: కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానాన్ని నిరసిస్తూ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన చేపట్టనుంది. వినాయక చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ, అనంతరం ధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.