అయిజ: వెంకటాపూర్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ
అయిజ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. పంచాయతీ కార్యదర్శి స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.