ఉరవకొండ: చికెన్ సెంటర్లు పరిశుభ్రంగా ఉంచాలి :బెళుగుప్ప
పంచాయతీ కార్యదర్శి మంజునాథ్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కోళ్ల విక్రయం, చికెన్ సెంటర్ల ఓనర్లతో పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మంజునాథ సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ చికెన్ సెంటర్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంతే కాకుండా చికెన్ సంబంధించిన వేస్టును పంచాయతీ కార్యాలయం వారు చూపిన స్థలంలోనే గుంత తీసుకొని గుంతలో వేసుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదన్నారు. విచ్చలవిడిగా పారివేయడం ద్వారా రోగాలు ప్రజలే అవకాశం ఉందన్నారు. ఆదేశాన్ని ధిక్కరిస్తూ అలా వేస్తే పంచాయతీ అధికారులు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని యజమానులకు పంచాయతీ కార్యదర్శి తెలిపారు.