బనగానపల్లె: అవుకు మండలంలోని సొంత గ్రామంలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మాజీ MLA కాటసాని
తన సొంత గ్రామం అవుకు మండలం గుండ్ల సింగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన 80వ స్వాతంత్ర్య వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. పాఠశాల చిన్నారుల మహనీయుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రం అని మాజీ ఎమ్మెల్యే కాటసాని అన్నారు. మాజీ సర్పంచ్ రమాకాంతరెడ్డి, ఉపాధ్యాయులు, పెద్దలు పాల్గొన్నారు.