విశాఖపట్నం: సింహాచలం శ్రీ స్వామివారికి రూ. 1,00,011 విరాళం అందజేత
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య అన్నప్రసాద పథకానికి ఢిల్లీకి చెందిన భక్తులు రూ. 1,00,011 విరాళం అందించారు. అర్జున్ మాలిక్, అనూజ మాలిక్ దంపతుల పేరిట ఈ సేవను నిర్వహించాలని వారు కోరారు. ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకట్రావు ఈ చెక్కును స్వీకరించారు.