భద్రాచలం: *దివ్యాంగ మహిళను స్వయంగా కలిసి అర్జీ స్వీకరించిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట*
దివ్యాంగ మహిళకు సంబంధించిన సమస్యను సంబంధిత అధికారులు అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం నాడు సబ్-కలెక్టర్ కార్యాలయ ఆవరణ వెలుపల ఉన్న సందర్శకుల ప్రాంతంలో ఒక దివ్యాంగ మహిళను స్వయంగా కలిసి, ఆమె వినతిపత్రాన్ని నేరుగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ మహిళకు సంబంధించిన వినతి పత్రాన్ని పరిశీలించి, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్-కలెక్టర్ సంబంధిత శాఖను ఆదేశించారు.
అలాగే, ఆమె కేసును పరిశీలించి, అర్హత మేరకు అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఆమెకు కల్పించాలని సబ్-కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఎవో భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.