మంచిర్యాల: సెలవు రోజుల్లో కళాశాల నిర్వహణ.. ఏబీవీపీ ధర్నా, అధికారుల తనిఖీలు
మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కళాశాల సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తుండటంతో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి, కళాశాల తెరిచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపనున్నట్లు డీఐఓ వెల్లడించారు.