బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో 8,000 మంది ఓటర్లకు నోటీసులు
కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలలో 8000 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు సమర్పించిన పత్రాల్లో సరైన వివరాలు పొందుపరచకపోవడం, పలు అంశాల్లో తప్పులు ఉండటంతో సరి చేసుకోవాలంటూ నోటీసులు జారీ చేసినట్లు తహసశీల్దార్ షఫీ వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు ఓటర్లకు గడువు విధించారు. వయస్సు, పేరు తప్పులతో పాటు మ్యాపింగ్ సరిచేసుకొని దరఖాస్తులు సమర్పించాలన్నారు