కమలాపూర్: కమలాపూర్ డంపింగ్ యార్డులో చెత్తకు మంటలు: పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు
హన్మకొండ జిల్లా కమలాపూర్ డంపింగ్ యార్డులో చెత్తకు మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగ, దుర్గంధంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.