ఒంగోలు అర్బన్: జరుగుమల్లి కస్తూరిబా గాంధీ విద్యాలయానికి చెందిన విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ని
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కస్తూరిబా గాంధీ విద్యాలయానికి చెందిన ఇద్దరు మైనర్ విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించిన రిటైర్డ్ మాజీ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి నిరసన వ్యక్తం చేసింది. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన కలిపి నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో పనిచేసే వంట మనిషి విద్యార్థులను తీసుకువచ్చి ఒంగోలులోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంటిలో విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నాగేందర్రావు డిమాండ్ చేశారు.