సాలూరు: సాలూరులో పార, చీపురు పట్టిన మంత్రి సంధ్యారాణి: 'ఏక్ దిన్ - ఏక్ ఘంట'లో శ్రమదానం
సాలూరులో జరిగిన 'ఏక్ దిన్ - ఏక్ ఘంట' పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రైతుబజార్ పరిసరాల్లో స్వయంగా చెత్తను తొలగించి, పట్టణాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.