ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణములో ఆగస్టు 15 వస్తే ఆ హోటల్లో టీ రూపాయే
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజులు తనదైన శైలిలో సేవతో గుర్తు చేసుకుంటున్నారు, ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ చిరు వ్యాపారి టి హోటల్ నడుపుతున్న నాగరాజు ఏటా ఆగస్టు 15వ తేదీ రోజున పది రూపాయలు విలువైన టీ కాఫీ లెమన్ టీ ని కేవలం ఒక్క రూపాయికే విక్రయిస్తున్నారు, గత పదేళ్లుగా ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు నా ఆయన హోటల్కు వచ్చే ప్రతి ఒక్కరికి రూపాయికి అందిస్తూ దేశభక్తికి తన వంతు సేవను చాటుతున్నారు