నర్సంపేట: నర్సంపేట వాగులో మొసలి ప్రత్యక్షం: సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బొజ్జ నాయక్తండా వాగులో కనిపించిన మొసలిని అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా పట్టుకున్నారు. దీనిని పాకాల సరస్సులో వదిలేసినట్లు అధికారులు తెలిపారు. వాగు పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.