ఆళ్లగడ్డ: అహోబిలంలో అటవీశాఖ సిబ్బంది విస్తృత తనిఖీలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉండడంతో అటవీ శాఖ అధికారులు గురువారం యాత్రికుల వాహనాలను తనిఖీ చేశారు, ఎగువ, దిగువ అహోబిలం, నల్లమల అడవి ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ తీసుకొని వెళ్లరాదని యాత్రికులకు సూచించారు, అడవిలోని జంతువులు ప్లాస్టిక్ బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేందుకు దేవస్థానం అధికారుల సూచనలతో అటవీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు