వెంకటాపురం: రామంజాపూర్ ఏహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ
ఏటూరునాగారం రామంజాపూర్లోని ఏహెచ్ఎస్ బాలికల పాఠశాలను ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతి, రికార్డులను పరిశీలించిన ఆయన, నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు.