పెద్దాపురం: రైతు బజార్లలో రూ.35కే ఉల్లి హామీ.. అమలుపై ప్రజల అసంతృప్తి
కిలో ఉల్లి రూ.35కే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, కాకినాడ జిల్లాలోని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దాపురం సహా పలు ప్రాంతాల్లో ఉల్లి సరఫరాపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు సబ్సిడీ ఉల్లి కోసం నిరీక్షిస్తున్నారు.