ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఫిషరీస్ శాఖ అధికారికి ప్రశంసా పత్రం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శనివారం నంద్యాలలోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఫిషరీస్ శాఖ ఆళ్లగడ్డ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ హీరా నాయక్ కు ప్రశంసా పత్రం ప్రధానం చేశారు, మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈ ప్రశంస పత్రాన్ని అందజేశారు, విధి నిర్వహణలో చూపిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు హీరా నాయక్ తెలిపారు, ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు