రాజమండ్రి సిటీ: అక్టోబర్ 5న వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభ: రాజమహేంద్రవరంలో జక్కంపూడి రాజా ప్రకటన
రాజమహేంద్రవరంలో అక్టోబర్ 5న వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీస్తూ 'అడుగు' నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ కమిటీల బాధ్యతల అప్పగింత, తాజా మాజీ ప్రజాప్రతినిధుల సత్కారం చేపట్టనున్నారు.