శ్రీశైలం: స్నేహితుడి చికిత్స కోసం జోలె పట్టిన స్నేహితులు, ఆత్మకూరులో హృదయ విధారక ఘటన
స్నేహితుడి ప్రాణాలను కాపాడేందుకు అతని స్నేహితులు జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు. కొత్తపల్లి మండలం కొక్కెరంచ గ్రామానికి చెందిన దినేష్ అనే యువకుడు జూపాడు బంగ్లా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో చికిత్స పొందుతున్నాడు.దినేష్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు సుమారు రూ.15 లక్షలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని చికిత్సకు ఆర్థిక సహాయం అందించేందుకు స్నేహితులు ముందుకొచ్చారు. ఆత్మకూరు పట్టణంలో జోలె పట్టి వీధుల్లో తిరుగుతూ, “మా స్నేహితుడి వైద్య చికిత్స కోసం మీకు తోచినంత సహాయం చేయండి” అంటూన్నారు