కనిగిరి: వెలిగండ్ల మండలం సురవారిపాలెం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
వెలిగండ్ల మండలంలోని సురావారిపాలెం లో గురువారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల నగదును భారీగా పెంచి అందజేస్తున్నారన్నారు. పెన్షన్ నగదును పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.