సారంగాపూర్: బీఆర్ఎస్ కార్యకర్తల ముందస్తు అరెస్టులపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టులను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఖండించారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, సాగునీరు, విద్యుత్ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.