విశాఖపట్నం: విశాఖపట్నంలో అక్టోబర్ 2, 3 తేదీల్లో 'ఖాదీ సంత' - బిజెపి జిల్లా అధ్యక్షుల ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో ఖాదీ సంతను ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో శ్రీ కరక చెట్టు పోలమాంబ కళ్యాణ మండపంలో ఈ సంత జరగనుంది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు తెలిపారు.