టెక్కలి: అరసవల్లి అభివృద్ధికి రూ. 55.74 కోట్లు మంజూరు
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 'స్వదేశ్ దర్శన్-2.0' పథకం కింద రూ. 55.74 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నిధులతో అరసవల్లి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారనుంది.