ఉరవకొండ: గ్రామాల్లో బిజెపి పార్టీ అభ్యున్నతికి కృషి చేద్దాం: బిజెపి స్టేట్ కౌన్సిలర్ మరియు మండల ఇంచార్జ్ లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మంటపం నందు గురువారం మండల బిజెపి నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బిజెపి స్టేట్ కౌన్సిలర్ ,మండల ఇన్చార్జి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి వాల్మీకి సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసులు, ఉరవకొండ మార్కెట్ యార్డు డైరెక్టర్ రామాంజనేయులు, నాయకులు రామలింగ, తగ్గుపర్తి ఎర్రి స్వామి, సుంకప్ప, మనోహర్, చంద్రశేఖర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు వాల్మీకి నాగరాజు పాల్గొనగా, మండల కన్వీనర్ పూజారి మధు ఆధర్యంలో కార్యక్రమం నిర్వహించారు.