భీమిలి: జనసేనలోకి సీనియర్ నేత పల్లా వెంకటరావు: భీమిలిలో పార్టీకి కొత్త బలం
భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి టీ.నగరపాలెం మాజీ సర్పంచ్ పల్లా వెంకటరావు చేరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల సందీప్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు వెంకటరావు తెలిపారు.