మోత్కూర్: మోత్కూర్ క్వాలిటీ బేకరీపై మున్సిపల్ అధికారుల చర్యలు, 5 వేల జరిమానా
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లోని క్వాలిటీ బేకరీలో బూజు పట్టిన దిల్ పసంద్ విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని బేకరీ నిర్వాహకులకు 5,000 రూపాయల జరిమానా విధించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.