మణుగూరు: దుగినేపల్లి ఎస్టీ కాలనీలో నిలిచిన విద్యుత్ సరఫరా: ఇబ్బందుల్లో గిరిజన కుటుంబాలు
పినపాక మండలం దుగినేపల్లి ఎస్టీ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే కరెంట్ కట్ చేశారని, ఇంటి నంబర్లు లేకపోవడం కూడా సమస్యగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని కోరుతున్నారు.