ఉరవకొండ: పట్టణంలో వైభవంగా ఉరగాద్రి శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైభవంగా ఉరగాద్రి శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం నేత్రపర్వంగా కొనసాగినాయి. వేడుకలో భాగంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పల్లకి ఉత్సవంలో జిల్లా నల మూలల నుండి భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లును చేసి తీర్థ ప్రసాదాలను అందించారు.