కొండపి: మర్రిపూడి మండలంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా మరిపూడి మండలం జంగాలపల్లిలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.