శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి పూర్తిగా నిలిచిపోయిన వరద నీటి ప్రావాహం
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా, ఔట్‌ఫ్లో 40,023 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.80 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 181.8320 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.