గజ్వేల్: సిద్దిపేట: ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్వాసితులకు కలెక్టర్ భరోసా, అధికారులకు కీలక ఆదేశాలు
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ములుగు మండలంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పునరావాస సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరువు ఎఫ్ టి ఎల్ బౌండరీలను ఫిక్స్ చేయాలని, ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.