జగిత్యాల రూరల్: జగిత్యాల: నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల్లో మొరం తీస్తే వాహనాలు జప్తు - అధికారులు హెచ్చరిక
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా మొరం తీయడంపై అధికారులు చర్యలు చేపట్టారు. మైనింగ్ ఏడి జైసింగ్ మరియు తహసీల్దార్ హకీమ్ క్షేత్రస్థాయిని పరిశీలించి, అక్రమ రవాణా చేసే వారి వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు.