ఎల్కతుర్తి: హన్మకొండ: NH-563 పై కోతులనడుమ గ్రామస్థుల రాస్తారోకో - అండర్పాస్ కోసం ఆందోళన
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామస్థులు అండర్పాస్ కోసం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రహదారి విస్తరణలో భాగంగా గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గాన్ని మూసివేయడంతో విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు.