ఉరవకొండ: గిరిజన సంక్షేమ నాయకులకు ఘనంగా గౌరవ సన్మానం
అంతర్జాతీయ గిరిజన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం అనంతపురం గిరిజన భవన్ నందు ఘనంగా జరిగిన కార్యక్రమంలో వజ్రకరూరు బెలుగుప్ప మండలాల గిరిజన సంక్షేమ సంఘాల నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప గిరిజన ప్రజా సంక్షేమం సంఘం (జి పిఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు గర్మ మల్లికార్జున నాయక్ గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. శివశంకర్ నాయక్ చేతులు మీదుగా వజ్రకరూరు మండలం ఎన్ ఎన్ పి తాండ గ్రామానికి చెందిన ఎస్.రామ్లానాయక్ నవతరం స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు వినోద్ నాయకులను సన్మానించారు.