రాజమండ్రి రూరల్: రాజమండ్రిలో 'పేదల సేవలో 2.0': స్వయంగా చెత్త వాహనం నడిపిన కలెక్టర్
రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి గ్రామంలో జరిగిన 'పేదల సేవలో 2.0' కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పారిశుధ్యంపై అవగాహన, లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ వంటి అంశాలపై ఈ కార్యక్రమం సాగింది.