ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆగస్టు 17వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని అధికారులు వెల్లడి
Ongole Urban, Prakasam | Aug 16, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లాలోని ప్రజల సమస్యలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. అర్జీదారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేరుగా మాట్లాడతారని వారి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.