శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మూడవరోజు వరుణ యాగం నిర్వహించిన అర్చకులు
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం పూజలు మూడో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చండీశ్వర పూజ, కంకణపూజ, కంకణధారణ కార్యక్రమాలను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఋత్విగ్వరణము, అఖండస్థాపన, రుద్ర, చండీ కలశస్థాపనలు, మండపారాధనలు, ఘటశుద్ధి, ఘటాలంకరణ కార్యక్రమాలతో పాటు రుద్ర పారాయణాలు నిర్వహించారు.సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, రుద్రహోమం, ఉపాంగ దేవతాహవనములు, జపాంగ హవనాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.