రామాయంపేట్: 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు: రామాయంపేట పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
రామాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1976లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకోవడమే కాకుండా, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని వారు తెలిపారు.