పెద్దకొత్తపల్లి: గంట్రావుపల్లి మత్స్య సహకార సంఘానికి నూతన కమిటీ ఎన్నిక
పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి మత్స్య సహకార సంఘానికి నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా బాలరాజ్, ఉపాధ్యక్షుడిగా సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన సభ్యులు వెల్లడించారు.