చిత్తూరు: చిత్తూరులో ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన: పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త సమ్మె
చిత్తూరు కలెక్టరేట్లో ఫీల్డ్ అసిస్టెంట్లు పీడీకి వినతిపత్రం సమర్పించారు. కనీస వేతనం 26 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, మ్యాన్డేస్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 5లోపు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.