నర్సంపేట: నర్సంపేటలో దారుణం: ఆధార్ అప్డేట్ పేరుతో వృద్ధురాలి మెడలో గొలుసు లాగే ప్రయత్నం!
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో ఆధార్ కార్డు అప్డేట్ చేస్తానని నమ్మించి వృద్ధురాలి మెడలోని గొలుసును లాగేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోగా, గొలుసు అక్కడే పడిపోవడంతో చోరీ తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.