విశాఖపట్నం కళావాణి పోర్ట్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 19' 2026న రోజుగార్ మేళ జరిగినది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలకు ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అధ్యక్షత వహించి సభను ఉద్దేశించి ప్రసంగించి ఎంపికైన అభ్యర్థులు అందరికి నియామక పత్రాలను అందజేశారు.